శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ రాజరాజేశ్వరీ దేవి
శరన్నవరాత్రి ఉత్సవములలో అమ్మవారి అలంకారములలో చివరి రూపము శ్రీ రాజ రాజేశ్వరీ దేవి. సకల భువన బ్రహ్మాండాలకు అమ్మ ఆరాధ్య దేవత. మహాత్రిపుర సుందరిగా ఈ దేవత త్రిపురాత్రయములో పూజలందుకుంటుంది.
ఆమ్మను అపరాజితాదేవిగా కూడా భక్తులు పూజించే ఆచారము ఉన్నది. ఈమె స్వప్రాకాశ జ్యోతి స్వరూపిణి. పరమేశ్వరుని అంకము అమ్మకు ఆసనము. ఇఛ్ఛా, ఙ్ఞాన, క్రియా శక్తులను ఈ మూర్తి తన భక్తులకు వరములుగా అనుగ్రహిస్తుంది. ఆమ్మ యోగమూర్తి. మాయా మోహిత మానవ మనోచైతన్యాన్ని రాజరాజేశ్వరీ దేవి ఉద్దెపితం చేస్తుంది. అనంత శక్తి స్వరూపమైన శ్రీచక్రమునకు అమ్మ అథిష్టాన దేవత.

- లలితా సహస్రనామము పారాయణము చేయవలెను.
- కుంకుమార్చన చేయవలెను.
- సువాసినీ పూజ చేయవలెను.
- శ్రీచక్రార్చన ఉత్తమమైనది.
- లడ్డూలు నివేదన చెయ్యాలి.
శ్రీరాజరాజేశ్వర్యష్టకము విషయ సూచికనందు కనుగొంగలరు
- మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
- రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
- మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి
- నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
- ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి
- ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి
- ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
- తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
- పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
Content Courtesy: Sri Durga Malleswara Swamy Devasthanam