Subscribe

శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ గాయత్రీ దేవి



శ్రీ గాయత్రీ దేవి
ముక్తా విద్రుమ హేమనీల ధవళచ్ఛాయై ర్ముఖై స్త్రీక్షణైః
ర్యుక్తామిందు నిబద్దరత్నమకుటాం తత్వార్థ వర్ణాత్మికాం
గాయత్రీం వరదాభయాంకుశకశాశ్శుభ్రం కపాలం గదాం
శంఖం చక్రమధార వింద యుగళం హస్తైర్వహం తీం భజే   

శరన్నవరాత్రులలో మూడొవ రోజు అమ్మ గాయత్రీ దేవిగా దర్శనమిస్తుంది.

సకల వేద స్వర్రొపం గాయత్రీ దేవి. అన్ని మంత్రాలకు మూలశక్తి గాయత్రీ దేవి. ముక్త, విద్రుమ, హేమ, నీల, ధవళ వర్ణాలు కలిగిన ఐదు ముఖాలతో శంఖం, చక్ర, గద, అంకుశం ధరించి దర్శనమిస్తుంది. ఆది శంకరులు గాయత్రీదేవిని అనంత శక్తి స్వరూపముగా అర్చించారు. ప్రాతః కాలములో గాయత్రిగానూ, మధ్యాహ్న కాలములో సావిత్రిగాను, సాయం సంధ్యలో సరస్వతిగానూ ఈమె ఉపాసకులతో ఆరాధనలు అందుకుంటుంది. ముఖములో అగ్ని, శిరస్సులో బ్రహ్మ, హృదయములో విష్ణువు, శిఖపై రుద్రుడు కొలువుంటారని పురాణములు చెబుతున్నాయి.   గాయత్రీదేవిని ధ్యానిస్తే అనంత మంత్ర శక్తి కలుగుతుంది. గాయత్రీ ఉపాసన వలన బుద్ధి తేజొవంతము అవుతుంది. గాయత్రీ మంత్రజపము చతుర్వేద పారాయణ ఫలితాన్ని ఇస్తుంది.

గాయత్రీ స్తోత్రములు పారాయణ చేసి అల్లపు గారెలు నివేదన చేయాలి.    

Image and Content Courtesy: Sri Durga Malleswara Swamy Devastanam

2 comments:

Manjusha kotamraju said...

చాలా మంచి విషయాలు చెప్తున్నారండి మీరు,,శ్రీసూక్తం,లక్ష్మీ అష్టొత్తరం కూడా పెడితే బాగుంటుంది అని నా అభిప్రాయం,నాకు ఎక్కడ దొరకలేదు లక్ష్మి అష్టోత్తరం,మీ దగ్గర ఉంటే పెట్టండి..

మురళీ కృష్ణ said...

మంజు గారికి ధన్యవాదములు.
శ్రీసూక్తము మరియు లక్ష్మీ అష్టోత్తరము త్వరలో చేర్చగలవాడను.
వెరేవి ఏమైనా కావలిసినచో తెలియపరచగలరు.

Post a Comment