Subscribe

శరన్నవరాత్రి ఉత్సవములు - శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి

దేవీ నవరాత్రులలో అత్యుగ్ర రూపము మహిషాసుర మర్ధినీ దేవి. ఆస్వయుజ శుధ్ధ నవమి రోజున అమ్మ మహిషాసురమర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసినది. ధర్మ విజయమునకు సంకేతముగా ఆశ్వయుజ శుధ్ధ నవమి రోజును మహర్నవమిగా భక్తులు ఉత్సవము జరుపుకుంటారు. సింహ వాహనమును అధీష్ఠించి ఆయుధములను ధరించిన అమ్మ సకల దేవతల అంశలతో మహాశక్తి రూపములో ఈ రోజు దర్శనమిస్తుంది.

అహిషాసురుడనే రాక్షసుడను సంహరించిన అమ్మను మహిషాసురమర్ధినీ దేవిగా పూజిస్తే శత్రుభయములు తొలగిపోయి సకల విజయములు కలుగుతాయి. ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించిన ఫలితము లభిస్తుంది.

చండీ సప్తశతీ హోమము చేయవలెను.
నివేదన: చిత్రాన్నము, గారెలు, వడపప్పు, పానకము నివేదన చేయవలెను.    

మహిషాసుర మర్ధినీ స్తోత్రము విషయ సూచిక నందు కనుగొన గలరు.


Content Courtesy: Sri Durga Malleswara Swamy Devastanam

0 comments:

Post a Comment