శ్రీ అన్నపూర్ణా దేవి
దసరా ఉత్సవాలలో మూడోరోజు అమ్మవారిని శ్రీఅన్నపూర్ణాదేవిగా అలంకరిస్తారు. సకల ప్రాణకోటికి జీవనాధారము అన్నము. అందుకే అన్నము పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపములో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆదిభిక్షువైన ఈశ్వరుడికి భిక్ష పెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృధ్ధి చెందుతుంది. మథుర భాషణ, సమయ స్పూర్థి, వాక్శుధ్ధి, భక్తిశ్రధ్ధలు, ఐశ్వర్యము కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణిడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్ఠి పోషకురాలు "అమ్మ" అనే అంతరార్థం ఈ అవతారములో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను అందిస్తుంది. బుధ్ధి, ఙ్ఞానాలను ఈ తల్లి వరములుగా ఇస్తుంది. పరిపూర్ణ భక్తితో తనను కొలిచే భక్తుల పోషణాభారము అమ్మ వహిస్తుందని ఆర్షవాక్యము.
పూజా విధానము
పుష్పములు: అమ్మను తెల్లని పుష్పాములతో పూజించాలి.
మంత్రము: హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేశి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహా అనే మంత్రము జపించాలి.
నివేదన: దధ్యన్నము, కట్టెపొంగలి
పారాయణ: అన్నపూర్ణ అష్టోత్తరము, స్తోత్రములు
శ్రీ అన్నపూర్ణాష్టకము విషయసూచిక నందు కనుగొనగలరు.
* * *
కట్టెపొంగలి చేసే విధానము:
Link for the recipe from Gayatri Vantillu
దద్దోజనము చేసే విధానము:
Link for the recipe from Gayatri Vantillu
* * *
- మొదటి రోజు: శ్రీ స్వర్ణ కవచాలంకృత దుర్గా దేవి
- రెండొవ రోజు: శ్రీ బాలా త్రిపుర సుందరీ దేవి
- మూడొవ రోజు: శ్రీ గాయత్రీ దేవి
- నాల్గొవ రోజు: శ్రీ అన్నపూర్ణా దేవి
- ఐదొవ రోజు: శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి
- ఆరొవ రోజు: శ్రీ మహాలక్ష్మీ దేవి
- ఏడొవ రోజు: శ్రీ సరస్వతీ దేవి
- ఎనిమిదొవ రోజు: శ్రీ దుర్గా దేవి ( దుర్గాష్టమి )
- తొమ్మిదొవ రోజు: శ్రీ మహిషాసుర మర్దినీ దేవి ( మహర్నవమి )
- పదొవ రోజు: శ్రీ రాజ రాజేశ్వరీ దేవి ( విజయదశమి )
Courtesy:
Annapoorna Devi Image & Content: Sri Durga Malleswara Swamy Devasthanam
0 comments:
Post a Comment