అక్షర మాలలో శ్రీమాతా
అఖిలాండేశ్వరి శ్రీమాతా
ఆది పరాశక్తి శ్రీమాతా
ఇంగితాదాయిని శ్రీమాతా
ఈశ్వర ప్రేరణి శ్రీమాతా
ఉమేశవల్లభ శ్రీమాతా
ఊహాతీత శ్రీమాతా
ఋగ్వేద ప్రియ శ్రీమాతా
ఋషిపూజితవే శ్రీమాతా
ఎక్కడ చూతునే శ్రీమాతా
ఏమని కొలుతునే శ్రీమాతా
ఐంద్ర వాహిని శ్రీమాతా
ఐశ్వర్యదాయిని శ్రీమాతా
ఓంకార రూపిణి శ్రీమాతా
ఔదార్య నిలయ శ్రీమాతా
అండపిండముల శ్రీమాతా
ఆవరించింతివే శ్రీమాతా
కరిపురవాసిని శ్రీమాతా
ఖండేందు శేఖరీ శ్రీమాతా
గణేశ మాతా శ్రీమాతా
ఘంటాధారిణి శ్రీమాతా
ఙ్ఞానరూపిణి శ్రీమాతా
చండనాశిని శ్రీమాతా
చాముండేశ్వరి శ్రీమాతా
చారుహాసిని శ్రీమాతా
ఛందస్సారా శ్రీమాతా
జాహ్నవి రూపిణి శ్రీమాతా
ఝంకార ధ్వని శ్రీమాతా
టవర్గ రూపిణి శ్రీమాతా
డామరి ఢాకిని శ్రీమాతా
తపనోడుపవే శ్రీమాతా
దారిద్ర్యనాశిని శ్రీమాతా
దారిచూపవే శ్రీమాతా
ధనప్రదాయిని శ్రీమాతా
నాదరూపిణి శ్రీమాతా
పంకజలోచని శ్రీమాతా
పరమానంద శ్రీమాతా
ఫలప్రదాయిని శ్రీమాతా
బాలాజననీ శ్రీమాతా
భైరవపూజిత శ్రీమాతా
భద్రకాళికా శ్రీమాతా
మంజుల రూపిణి శ్రీమాతా
మహిష మర్దిని శ్రీమాతా
మంజుల భాషిణి శ్రీమాతా
మంత్ర పురీశ్వరీ శ్రీమాతా
యఙ్ఞరూపిణి శ్రీమాతా
యాగ రక్షకీ శ్రీమాతా
రాకేందువదనే శ్రీమాతా
రాక్షస నాశిని శ్రీమాతా
లోభనాశిని శ్రీమాతా
వాంఛిత దాయిని శ్రీమాతా
శంకర తోషిణి శ్రీమాతా
శర్మదాయిని శ్రీమాతా
శంభుమోహిని శ్రీమాతా
షణ్ముఖ జననీ శ్రీమాతా
సాకారప్రియ శ్రీమాతా
సర్వాంగ సుందరి శ్రీమాతా
సర్వానవద్యా శ్రీమాతా
హకారార్థా శ్రీమాతా
హవిర్భోక్త్రీ శ్రీమాతా
హ్రీంకార రూపిణి శ్రీమాతా
హ్రీంకార శారిక శ్రీమాతా
క్షరాక్షరాత్మికా శ్రీమాతా
క్షీరాబ్ధి తనయా శ్రీమాతా
శ్రీమాతా జై శ్రీమాతా
శ్రీమాతా జై శ్రీమాతా
రచన: బ్రహ్మశ్రీ వేణుగోపాలా శర్మ గారు
0 comments:
Post a Comment